8.
ధర్మసుత్రాల్లో అద్వైత భావాలు
{మహామహోపాధ్యాయ
చిన్నస్వామి శాస్త్రిగారు}
డాక్టర్ .
చిలకమర్తి దుర్గాప్రసాదరావు
ఆపస్తంబుడు తన ధర్మ
సూత్రాల్లో “ఆత్మ లాభాన్న పరం
విద్యతే కించిత్” అనే సూత్రం
ద్వారా ఆత్మలాభం కంటే ఉన్నతమైనటువంటి లాభం మరేదీ లేదని పేర్కొన్నాడు . ఆత్మ నిత్యం కాబట్టి ఆత్మలాభం పొందడానికి అజ్ఞానాన్ని
తొలగించుకోవడమే మార్గం . హరదత్తాచార్యులవారు ఈ విషయంలో ఒక కథను దృష్టాంతంగా
ప్రస్తావించారు. ఒక రాజకుమారుడు కొంతమంది ఆటవికులచే పెంచబడి, పెరిగి పెద్దవాడయ్యాడు. తనను ఆటవికునిగానే భావించు కుంటున్నాడు .
ఎప్పుడైతే ఒక వ్యక్తి
ద్వారా తాను ఆటవికుడను కానని రాజకుమారుడనని తెలుసుకుంటాడో అప్పుడు అతని లో ఉండే భ్రాంతి
తొలగిపోతుంది ఈ కథను శ్రీ భగవత్పాదులు కూడ బృహదారణ్యక
ఉపనిషత్తులో ప్రస్తావించడం మనం గమనిస్తాం.
ఓమితి బ్రహ్మ బ్రహ్మవా ఏష జ్యోతి :
య ఏష తపతి ఏష వేదో య ఏష తపతి వేద్యమేవైతత్
య ఏష తపతి ఏవమేవైష ఆత్మానం తర్పయతి
ఆత్మనే నమస్కరోతి ఆత్మా బ్రహ్మ ఆత్మా జ్యోతి:
ఓం అనే అక్షరం బ్రహ్మ అది జ్యోతి స్వరూపం . ఆ జ్యోతిని
ప్రకాశంపచేసేది వేదం. ప్రకాశం కలుగ జేసేవాడు వేద్యుడు. ఆత్మ (తనకే) ఆత్మకే
నమస్కరిస్తుంది. ఆత్మయే బ్రహ్మ ఆత్మయే జ్యోతి. (బోధాయన సూత్రం) అన్నము బ్రహ్మ
ఆ అన్నాన్ని సమర్పించేవాడు భుజించేవాడు కూడ బ్రహ్మమే మొదలైన భావాలు జీవ,బ్రహ్మల
ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి
><(*)<*>{*}<>
No comments:
Post a Comment