4. యజుర్వేదంలో అద్వైతభావాలు
(శ్రీ శంకరకింకరులు)
అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి
దుర్గాప్రసాదరావు
“ భగవంతుడు ఈ
ప్రపంచాన్ని సృష్టించి తానే స్వయంగా ప్రవేశించాడు” అని తైత్తిరీయోపనిషత్తు చెపుతోంది .(తైత్తిరీయ
ఉపనిషత్తు)
సూర్యునిలో ఉన్న ఆ పరమాత్మ, నీలో ఉన్న ఆ పరమాత్మ ఇద్దరు ఒకటేనని తైత్తిరీయ ఉపనిషత్తు చెపుతోంది. పరమేశ్వరుడే మనకు తండ్రియని, అతడే రక్షకుడని, తన
నుంచే నామరూపాత్మకమైన ఈ ప్రపంచం సృష్టించాడని,
తానే అనేక దేవతారూపాలతో ఉన్నాడని, ఈ
ప్రపంచమంతా ఆయనలోనే దాగి ఉందని తైత్తిరీయసంహిత వివరించింది. ఈ ప్రపంచానికి
సృష్టికర్తయైన భగవంతుని నువ్వు తెలుసుకోలేవని , అతనికి నీకు మధ్య మాయ అనే మంచుపొర
ఉందని మానవులు మాయ అనే మంచుతెర ముసుగులో సుఖం అనుభవిస్తూ, ఆనందిస్తున్నారని
వివరిస్తోంది.
>*<>*<*><*><
No comments:
Post a Comment