9. భగవద్గీతలో అద్వైతభావాలు
శ్రీ మండలీక వేoకటేశ్వరశాస్త్రి గారు
డాక్టర్ .
చిలకమర్తి దుర్గాప్రసాదరావు
శ్రీమద్భగవద్గీత యొక్క ప్రాముఖ్యమేమిటంటే అది
స్వయంగా శ్రీ కృష్ణ భగవానుని నోటి
నుండి వెలువడింది. ఇక గీతాశాస్త్ర విషయంలో పండితకంలో ఎన్నో పరస్పర భిన్నాభిప్రా యాలున్నాయి. కొంతమంది ఆచార్యులు జ్ఞాన పారమ్యాన్ని, మరి కొంతమంది భక్తిపారమ్యాన్ని ఇంకా కొంతమంది
కర్మపారమ్యాన్ని సమర్ధించారు. ఇంతకీ ఆ
భగవద్గీత మనకు ఏమి బోధిస్తోంది?
వాస్తవానికి మోహపరవశుడైన అర్జునుడు
శ్రీకృష్ణపరమాత్మ ఎదుట ఎన్నో సందేహాల్ని, సమస్యల్ని వెలిబుచ్చాడు.
శ్రీకృష్ణుడు వాటికి సరైనా సమాధానాలు ఇవ్వడం జరిగింది. భగవానుని సృష్టిలో మానవుడు ఒక అంశ. “మమైవాsoశో జీవలోక జీవభూత: సనాతన:” అని గీతావాక్యం
. ఇక మానవునికి కావలసిన అవసరాలన్నీ అందించగలిగే
గొప్ప గ్రంథం భగవద్గీత. “నత్వేవాహం జాతునాసం”
“మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ”మొదలైన మాటల్లో జీవాత్మ యొక్క సత్యత్వాన్ని ఇంద్రియాలు ,
భౌతిక వస్తువుల యొక్క అశాశ్వతత్వాన్ని వివరించాడు.
“నాsసతో విద్యతే భావ: నాsభావో విద్యతే సత:” మొదలైన శ్లోకాల్లో
మిథ్యాజ్ఞానం వల్లకలిగే అనర్థం వర్ణించబడింది. ఈ విధంగా ఆత్మాsనాత్మల స్వభావాన్ని
విశ్లేషించి “అవినాశి తు త్వం విద్ధి”
అనే వాక్యాలద్వారా జీవాత్మ యొక్క శాశ్వతత్వం ప్రతిపాదించడమైనది . భగవానుడు ఈ విధంగా జీవాత్మ, పరమాత్మల యొక్క
ఏకత్వాన్ని ప్రతిపాదించారు. అంతేగాక అధిష్ఠానజ్ఞానం కలుగగానే ఆరో పితం అసత్యమని తెలుస్తుందనే సత్యం ఈ మాటల్లో వ్యక్తమౌతోoది. ఏడవ అధ్యాయంలో “జ్ఞానం
తేsహం సవిజ్ఞానం” మొదలైన శ్లోకాల ద్వారా ప్రపంచానికి ఆధారభూతమైన ఆత్మ
సర్వవ్యాపి అని “ఇదం శరీరం కౌంతేయ” మొదలైన వాక్యాల్లో దృక్- దృశ్య వివేకం
ప్రతిపాదించి అన్ని శరీరాల్లో ఉండే ఆత్మ ఒక్కటేనని , ఉపాధిభేదం వల్ల అది భిన్నంగా
కనిపిస్తోందని, ఆన్ని క్షేత్రాల్లో ఉండే ఆ
క్షేత్రజ్ఞుడు తాను మాత్రమే అని సహేతుకంగా
వివరించడం విశేషం . జ్ఞానాజ్ఞానాల తారత్మాన్ని విశ్లేషిస్తూ జ్ఞానం, అజ్ఞానాన్ని నిర్మూ లిస్తుందని, అసలు అజ్ఞాననివృత్తియే
జ్ఞానమని అది ఆత్మసాక్షాత్కారరూపమేనని , ఆత్మసాక్షాత్కారం
కలిగినవాడు జీవన్ముక్తుడే అని
తెలియజేస్తుంది.
ఇక అద్వైతసిద్ధాంతముఖ్యలక్షణమైన , జ్ఞానం వల్ల ముక్తి కలుగడమని , అది బ్రహ్మావగతి రూపమని ఎంతోమంది జ్ఞాన తపస్సుతో
తనను చేరుకున్నారని వివరించాడు.
ఈ వ్యాసంలో మరెన్నో విషయాలు పొందు పరచబడ్డాయి వాటిని వ్యాసవిస్తరభీతితో వదలడమైనది.
<><><><>
No comments:
Post a Comment