13. సాంఖ్య-యోగదర్శనాలలో
అద్వైతభావాలు
(s.సుబ్రహ్మణ్యశాస్త్రి)
అనువాదం :-
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
సాంఖ్యదర్శన
ప్రవర్తకుడు కపిలమహర్షి. ఈశ్వర కృష్ణుడు
రచించిన ‘సాంఖ్యకారికలు’ సాంఖ్య దర్శనానికి అతి ప్రాచీన గ్రంథంగా పేరు పొందింది.
సాంఖ్యసిద్ధాంత ప్రతిపాదితుడైన ఆత్మరూపమైన పురుషుడు నిత్య ముక్తుడని ,ఎటువంటి బంధాలు లేనివాడని ,
స్వతంత్రుడని చెప్పడంలో అద్వైత సిద్ధాంత భావాలు కనిపిస్తున్నాయి.
శ్రీమద్భాగవతంలోని
కపిలమహర్షి బోధలు అద్వైత భావాలతోనిండి యున్నాయి.
ఇక యోగ దర్శన
ప్రవక్త పతంజలి మహర్షి . యోగ సూత్రాలకు మూలం, పునాది హిరణ్యగర్భుడయిన బ్రహ్మ . పతంజలిమహర్షి యోగ సూత్రాలను మనకు అందించారు. వేద వ్యాసుని వంటి మహనీయుడు ఈ సూత్రాలు వ్యాఖ్యానించాడు.
మనస్సును నియంత్రించడం ద్వారా (చిత్త వృత్తి నిరోధం) అద్వైతాత్మ సాక్షాత్కారాన్ని
కలిగించడమే యోగ శాస్త్రం యొక్క పరమ ప్రయోజనం. యోగ శాస్త్ర
పరమావధి,యోజనం కూడ అద్వైతమే. వ్యాసంలో ఈ
విషయాలు విస్తృతంగా చర్చించడం జరిగింది.
<*><*><*>
No comments:
Post a Comment