3. ఋగ్వేదంలో అద్వైత భావాలు
(జంబుకేశ్వరం శివరామకృష్ణ ఘనాపాఠీ అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
ప్రతి వేదం కర్మకాండ -జ్ఞాన కాండ అని రెండు భాగాలుగా
విభజింపబడింది . పూర్వమీమాంస కర్మకాండగాను , ఉత్తర మీమాంస జ్ఞానకాండగాను
వ్యవహరించబడుతున్నాయి.
పూర్వమీమాంస సమస్త మానవజాతి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మానవునికి ఎన్నో
యజ్ఞయాగాది వైదిక కర్మలు విధించింది. ఇక వేదానికి రెండో భాగం అయినటువంటి జ్ఞానకాండ
మానవునికి కావలసిన ఆత్మ(స్వరూప) జ్ఞానం బోధిస్తుంది. ఈ ఆత్మజ్ఞానప్రాప్తికి జీవుడు, బ్రహ్మ ఒకటే అనే భావన , ప్రతిఫలాసక్తి
లేని నిష్కామకర్మానుష్ఠానం, భక్తి, వేదాంతశ్రవణాసక్తి, ధ్యానం, నిధిధ్యాసనం మొదలైనవి సోపానాలుగా ఉపయోగపడతాయి. జ్ఞానకాండలో వేదాంత విషయాల ఆవశ్యకత చాల అవసరం .
కాని కర్మకాండకు సంబంధించిన పుర్వమీమాంసాభాగంలో కూడ అద్వైతాత్మతత్త్వాన్ని బోధించే
ఎన్నో వాక్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇదే ఋగ్వేద స్వరూపగా కనిపిస్తోంది.
“ఏకం సత్ విప్రా బహుధా వదంతి(2-3-22-6) అనే మాట మనం పరిశీలిస్తే సత్పదార్థం ఒక్కటే యని దాన్ని
జ్ఞానులు విష్ణువని , ఇంద్రుడని, సూర్యుడని, వరుణుడని, అగ్నియని, గరుత్మంతుడని ఎన్నో విధాలుగా భావిస్తున్నారని
తెలుస్తోంది .
“ నేనే మనువును, నేనే
సూర్యుడను , నేనే కక్షిమంతుడను సమస్తమునై యుంటిని (3-6-15-1)అని వామదేవుడు ఒక చోట చెప్పడం మనం గమనిస్తాం.
జీవుడు తాను స్వయంగా భగవంతుడనని తెలుసుకోలేక పోవడం వల్లనే దు:ఖానికి
లోనౌతున్నాడు. ఎప్పుడైతే తాను శరీరం కంటే,
బుద్ధి కంటే, మనసు
కంటే, ఇంద్రియాలకంటే అతీతమైన పరమాత్మ స్వరూపుడనని తెలుసుకుంటాడో అప్పుడే
సంసారరూపమైన దుఃఖం నుంచి విముక్తుడౌతున్నాడు (8-1-20-1),
<*><*><*><*><*>
No comments:
Post a Comment