6. అథర్వవేదంలో అద్వైతభావాలు.
(శ్రీ. శివరామకృష్ణ
శాస్త్రి)
అనువాదం :-
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
కర్మకాండకు
సంబంధించిన అధర్వవేదంలో కూడ అద్వైత వేదాంతానికి సంబంధించిందన ఎన్నో విషయాలు కనిపిస్తున్నాయి .కాలసూక్తంలో
“ బ్రహ్మ హోతా , బ్రహ్మ యజ్యా బ్రహ్మణా స్వరే వోమితా: |
అధ్వర్యు: బ్రాహ్మణో జాతో బ్రాహ్మణో soతర్హితం హవి:” || మొదలైన
మంత్రాలద్వారా
బ్రహ్మమే హోత, బ్రహ్మమే యాగము, బ్రహ్మమే
యథార్థమైన యజ్ఞంఫలం అని చెప్పబడింది.
అలాగే “ త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమారా ఉత వా
కుమారీ|త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి విశ్వతో ముఖ:” || (
అథర్వ*11 కాండం -9,10,11) మొదలైన శ్రుతులు
“నీవే స్త్రీ , నీవే పురుషుడవు, నీవే బాలుడవు , నీవే బాలికవు , నువ్వు దండం పుచ్చుకొని
నడుస్తున్నావు. నీవే విశ్వతోముఖుడవు” (10-8-27) అని చెపుతున్నాయి.
<*><*><*><*>
No comments:
Post a Comment