5. సామవేదంలో
అద్వైతభావాలు
(మాయూరవాసీ శ్రీ. రామనాథ దీక్షిత:)
అనువాదం :- డాక్టర్ చిలకమర్తి దుర్గాప్రసాదరావు .
సామవేదానికి ఒక 1000 శాఖలున్నట్టుగా తెలుస్తోంది. వీటిలో కౌథుమశాఖ
ఒక్కటే దక్షిణ భారతదేశంలో చాల ప్రాచుర్యంలో
ఉంది. ఈ వేదానికి సంబంధించినటువంటి సంహిత, ఎనిమిది బ్రాహ్మణాలు ఎన్నో అద్వైత వేదాంత విషయాలతో కూడి ఉన్నాయి. సామవేదబ్రాహ్మణoలో ఒకచోట సృష్టికర్త
‘అహమ:’ అనే పదం ద్వారా అహమునిగా చెప్పపడ్డాడు. దీని సారాంశం ‘నేను’ అని. దీన్ని బట్టి ప్రపంచానికి ఆధారం, సృష్టికర్త అయిన ప్రభువు,
జీవుడు ఒకరేనని తెలుస్తోంది. మట్టి
యొక్క స్వరూపం తెలిస్తే ఆ మట్టితో చేయబడిన వస్తువుల యొక్క స్వరూపం తెలుస్తుంది ఎందుకంటే మట్టితో చేయబడిన వస్తువులు మట్టి యొక్క ప్రతిరూపాలు లేదా వికారాలు మాత్రమే, అవి మట్టికంటే భిన్నం కావు . మట్టి ఒకటే సత్యము,
నిత్యమున్ను . నామరూపాలు సత్యం కావు. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగితే సమస్తము తెలుస్తుంది , అవగతమౌతుంది(ఛా౦దోగ్యం-6)
అనే విషయం “తత్త్వమసి” (ఛా౦దోగ్యం-6) అనే
వాక్యం ద్వారా జీవునికి పరమాత్మకు భేదం
లేదని చెప్పబడింది. పరమేశ్వరుడే జీవుల యొక్క శరీరంలో ప్రవేశించి నామ రూపాలు
కల్పించాడని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ఛా౦దోగ్యం ద్వారా మనకు తెలుస్తున్నాయి.
*X*X*X*X*X*X*
No comments:
Post a Comment