‘Charucharya’of Kshemendra
(A treatise on moral education)-3
Dr. Chilakamarthi Durgaprasada Rao
3. पुण्यपूतशरीर: स्यात् सततं स्नाननिर्मल: |
तत्याज वृत्रहा स्नानात् पापं वृत्रवधार्जितम् ||
•
सततं =ఎల్లప్పుడు ; स्नाननिर्मल: =స్నానముచే శుభ్రమైన
; पुण्यपूतशरीर:= పుణ్యముచే పవిత్రమైన శరీరముగలవాడు ; स्यात्=కావలయును; वृत्रहा= (వృత్రాసురుని చంపిన)
దేవేం౦ద్రుడు; स्नानात्= స్నానము వలన; वृत्रवधार्जितम् = వృత్రాసురుని చంపుటవలన
కలిగిన; पापं
=పాపమును ; तत्याज=పోగొట్టుకొనెను
•
పుణ్య పూత శరీర: స్యాత్
సతతం స్నాన నిర్మల:
తత్యాజ వృత్రహా స్నానాత్
పాపం వృత్రవధార్జితం
మానవుడు స్నానముచే శుభ్రమైన శరీరముగలవాడు కావలయును . వృత్రాసురుని
చంపిన దేవేంద్రుడు తనకు సంక్రమించిన బ్రహ్మహత్యా పాతకమును స్నానము చేసి వదల్చుకొనెను
. ఇక్కడ స్నానము యొక్క ప్రాధాన్యం చెప్పబడింది . అంతేగాని స్నానం చేస్తే పాపాలు పోతాయని భావి౦పరాదు . మన భారతీయసంస్కృతిలో స్నానానికి చాల
ప్రాముఖ్యం ఉంది . “ శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్;
లక్షం విహాయ దాతవ్యం, కోటిం త్యక్త్వా హరిం
స్మరేత్ ” అన్నారు . వంద పనులు ప్రక్కనపెట్టి ముందుగా వేళకు భోజనం చెయ్యాలి
. వేయిపనులు ప్రక్కకు నెట్టి సమయానికి స్నానం చెయ్యాలి. లక్షపనులు విడిచి పెట్టి దీనులకు
మనకున్నంతలో దానం చెయ్యాలి. కోటిపనులు వదలిపెట్టి దైవధ్యానం చెయ్యాలి. ఈ విధంగా బోనం,
బోనం కంటే స్నానం , స్నానం కంటే దానం , దానం కంటే ధ్యానం
చాల ముఖ్యమైనవి అని గ్రహించాలి .
•
One should get healthy
body by taking bath. Indra who killed Vritrasura could remove his sins of
killing Vritra by taking bath. This does
not mean that bathing removes sins but it only reveals the importance of taking
bath. If body becomes pure mind also becomes pure. A sound mind in a sound
body. (Refer the Ramayana of Valmiki for
more information about the slain of Vritraasura).
No comments:
Post a Comment