Thursday, January 12, 2017

6. ‘Charucharya’of Kshemendra (A treatise on moral education)

6.    ‘Charucharya’ of Kshemendra
(A treatise on moral education)
                             Dr. Chilakamarthi Durgaprasada Rao                                                                     dr.cdprao@gmail.com

౬. नोत्त्तरस्यां प्रतीच्यां वा कुर्वीत शयने शिर: |
   शय्याविपर्ययाद्गर्भो दिते: शक्रेण पातित: || 
शयने=నిద్రపోతున్నప్పుడు; उत्त्तरस्याम् =ఉత్తరదిశవైపునకు; वा= లేక ; प्रतीच्याम्=తూర్పుదిక్కున; शिर:++कुर्वीत=తలపెట్టుకొన రాదు; शय्याविपर्ययात्= కూడని దిశలో తలపెట్టుకొనుట వలననే ; दिते:=దితి యొక్క; र्भ:= గర్భము;  शक्रेण =ఇంద్రుని చేత; पातित: = పోగొట్టబడెను/ నాశనం చెయ్యబడెను .

నోత్తరస్యాం ప్రతీచ్యాం వా కుర్వీత శయనే శిర:
శయ్యా విపర్యయాద్గర్భో దితే: శక్రేణ పాతిత:   (౬)
ఎవరు తమ తలను తూర్పు దిశలో గాని , ఉత్తరదిశలో గాని పెట్టుకొని నిద్రి౦చరాదు. కశ్యపప్రజాపతి భార్యయైన దితి ఆ విధముగా నిద్రి౦చుటవలననే ఇంద్రుడు ఆమె యొక్క గర్భమును నాశనము చేయ గలిగెను. కశ్యపప్రజాపటికి ఇద్దరు భార్యలు . మొదటి భార్య దితి, రెండవ భార్య అదితి. దితికి పుట్టినవారంతా దైత్యులు (రాక్షసులు ) అయ్యారు. అదితికి పుట్టిన వారు దేవతలు (ఆదిత్యులు ) అయ్యారు. ఒకనాడు దితి దేవతలను తలదన్నే సంతానాన్ని కనాలనే ఉద్దేశంతో భర్త వలన గర్భం ధరించింది .ఆమె గర్భాన్ని నాశనం చెయ్యడానికి ఇంద్రుడు ప్రయత్నిస్తున్నాడు . కాని అవకాశం దొరకడం లేదు. ఒక రోజున ఆమె పొరబాటున తలను ఉత్తరదిక్కువైపు పెట్టుకొని నిద్రిస్తూ ఉండగా అదే అవకాశంగా భావించిన ఇంద్రుడు ఆమె గర్భమును నాశనం చేయగలిగాడని పురాణాలు చెబుతున్నాయి . ఇది కేవలం విశ్వాసమా లేక శాస్త్రసమ్మతమా అనే విషయం పరిశీలించవలసి ఉంది. శాస్త్ర సమ్మతమైతే అనుసరించవచ్చు

One should not sleep by keeping his or her head towards East or North. Diti was the daughter of Daksha, sister of Aditi, wife of Kashyapa and the mother of rakshasas. The fetus of Diti is destroyed by Indra as she had slept by keeping her head towards north.   
The reason for not keeping one’s head towards North while sleeping,  is proved scientifically. But the reason for avoiding east is yet to be proved. So it is advised not to take every thing for granted unless it is scientifically proved.  See the below cited link for further information:


                                                 ******

1 comment:

Rudraksha Ratna said...

Ganesh Rudraksha Benefits. Ganesh Rudraksha is a Rudraksha bead that has a trunk like projection on it.