12. పూర్వమీమాంసా దర్శనంలో
అద్వైతభావాలు.
(శంకరకింకరులు)
అనువాదం :-
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు
పూర్వమీమాంసాదర్శన
ప్రవర్తకులు జైమిని మహర్షి. పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్న లేదా ఆభాసిస్తున్న వేదవాక్యాలను సమన్వయం చెయ్యడానికి, సందేహనివృత్తి
చేస్తూ వేదవాక్యాల అర్ధాన్ని వివరించడం
ద్వారా యజ్ఞయాగాది క్రతువులకు ప్రేరేపించడమే ప్రధాన ప్రయోజనంగా ఈ శాస్త్రం వెలువడింది. . కానీ ప్రవక్తలు
అంతటితో ఆగలేదు. ఎందుకంటే ఏ యాజ్ఞికుడు తాను చేసిన యజ్ఞాలకు తగిన ఫలం తానే అనుభవించడానికి
అవకాశం లేకపోతే యాజ్ఞికవిధుల పట్ల ఆసక్తి కనబరచడు.
అలాగే ఏ సోమయాజీ యజ్ఞం పూర్తయిన వెంటనే సాక్షాత్తుగా స్వర్గం
చేరుకోలేడు. అందువల్ల వారు దేహం , మనస్సు, ఇంద్రియాలకంటే అతిరిక్తమైన ఆత్మయొక్క
అస్తిత్వాన్ని అంగీకరించి తీరాలి.
ఇక జీవుని స్వరూపం రెండు విధాలు. ఒకటి- మన దైనందినజీవితంలోనున్న “నేను
కర్తను”, “నేను భోక్తను” అనే అనుభవం . రెండు- వేదాంతులు చెప్పే సచ్చిదానంద
స్వరూపమైన ఆత్మతత్త్వం . కుమారిలభట్టు ఈ రెంటిని కూలంకషంగా విశ్లేషించి నిజమైన
ఆత్మతత్త్వం తెలుసుకోడానికి వేదాంతమతాన్ని ఆశ్రయించి తీరవలసిందే అన్నారు.
కుమారిలభట్టు ఆత్మను యజ్ఞకర్మ
ఫలాలనుభవించే కర్తృత్వ , భోక్తృత్వ విశిష్టమైనదిగా వర్ణిస్తూ
యజ్ఞయాగాది కార్యకలాపాలు నిర్వహించడానికి
, ధర్మాచరణకు వేదాంత ప్రతిపాదితమైన ఆత్మతత్త్వజ్ఞానం అనావశ్యకమేకాక, ప్రతిబంధకం కూడ
ఔతుందని అభిప్రాయపడ్డారు. (Br.సూత్రం. ఉపమార్డం చ 3-4) అది కుమారిల భట్టు
అభిప్రాయంగా మీమాంసలోనే మరొక శాఖకు చెందిన ప్రభాకరమిశ్రులవారి మాటలద్వారా వెల్లడౌతోoది.
‘నేను’ ‘నాది’ అనేవి ఆత్మపైన ఆరోపించ బడిన మిథ్యారూపమైన భావనలే. ఇది సత్యం . ఇందులో
ఎటువంటి సందేహంలేదు. కాని ఇవి సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులకే వర్తిస్తాయి.
అందుకే పరమపుజ్యులైన కృష్ణ ద్వైపాయనులు కూడ అజ్ఞానులై కర్మాచరణ
అచేస్తున్నవారి మనస్సులను ఎవ్వరు విషపూరితం చెయ్యకూడదని (న బుద్ధి భేదం
జనయేదజ్ఞానాం కర్మసంగినామ్) గట్టిగా కట్టడి
చేశారు.
<><><><><>
No comments:
Post a Comment