రామలింగని రసికత
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ప్రతి శృ౦గారరసపద్యాన్ని శ్రీ నాథమహాకవికి ,
ప్రతిహాస్య రస పద్యం తెనాలి రామ లింగనికి అంటగట్టడం జరిగింది . వాటి కర్తృత్వ
విషయం ప్రక్కన పెడితే పద్యాలు మాత్రం రసవత్తరంగా ఉంటాయి. మనకు కావలసింది స్వారస్యం
, ఎవరు రచి౦చారన్నది తరువాత విషయం . ప్రస్తుతం తెనాలి రామ లింగని పద్యం ఒకటి
పరిశీలిద్దాం .
తెనాలి రామలింగడు ఒక వేశ్యను ఇష్ట పడుతూ ఉండే
వాడు ఆమె కూడ అతనిపట్ల చనువు, ప్రేమ ప్రదర్శిస్తో ఉండేది. సాధారణంగా ఆటవెలదులు
కాసులపైన మోజు చూపుతారు. డబ్బులేని వాణ్ణి ఆదరించరు. ఈమె కూడ ఇంచుమించు అటు వంటిదేనేమో!
ఒక నాడు రామలింగని వద్ద చిల్లిగవ్వ లేదు ,
ఆమె వద్దకు వెళ్ళాడు . ఆమె ఆదరించలేదు. బయటకు పొమ్మంది , పోనన్నాడు . వెనక్కి
తిరిగి పడుకుంది. రామలింగడు కవి , అందులోనూ చాల ప్రతిభావంతుడు . ఆ కవి ఆశువుగా
చెప్పిన పద్య౦ ఎంత అందంగా ఉందో చెప్పడం కోసమే
ఈ ప్రయత్నం . మిగిలిన విషయాలు ముఖ్యం కాదు.
ఆయన ఆమెనుద్దేశి౦చి అంటున్నాడు .
మత్తేభవృత్తం
వర బి౦బాధరముం బయోధరములున్ వక్రాల కంబుల్ మనో
హరలోలాక్షులు చూపకవ్వలి మొగంబైనంత నేమాయె నీ
గురు భాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు మాకు౦ జాలవే గంగ కి
ద్దరిమేలద్దరి కీడును౦ గలదె? యుద్యద్రాజ బింబాననా!
ఉదయించుచున్న చంద్రబింబం వంటి ముఖం గల ఓ చిన్నదానా !నువ్వు
నీ దొండపండు వంటి పెదవిని , స్తనాలను , ముంగురులను చూపి౦ చ కు౦ డా అటు తిరిగి
పడుక్కు౦ టే నాకొచ్చిన నష్టమే౦టి? నీ జడ , జఘనం నాకు సరిపోతాయి , గంగలో ఈ ప్రక్కన
స్నానం చేస్తే పుణ్యం ఆ ప్రక్కన చేస్తే పాపం అనే నియమం ఏమీ లేదుగదా ! అన్నాడు.
ఈ పద్యం కేవలం రచనాసౌందర్యం కోసమే పేర్కొనబడింది గాని మరో కారణం ఏమీ లేదు .
కవి శృ౦గారి ఐతే కావ్యం రసవంత మౌతుంది అలా కాకుండా కవి శృ౦గార
రస విముఖుడైతే కావ్యం రసహీన మౌతు౦దని శాస్త్రకారుల అభిప్రాయం . ఈ విషయం వారి
మాటల్లోనే విందాం
శృ౦గారీ చేత్ కవి: కావ్యం జాతం రసమయం జగత్
స ఏవ వీతరాగ శ్చేన్నీరసం జాతమేవ తత్
కవి శృ౦గారి యైనచో కావ్యం రసవంత మౌతుంది . అలా కాకుండా కవి రస హీనుడైతేకావ్యం రసహీనంగానే ఉంటుంది. కాబట్టి కవి , పాఠకుడు ఇద్దరు రసికులైతే ఆ కావ్యం ఒక రస గుళికగా తయారౌతుంది. కావ్య రసానందం బ్రహ్మానందంతో ఇంచు మించు సమానం .
No comments:
Post a Comment