Sunday, May 9, 2021

సదవగాహన -1 Chilakamarthi. Lakshmi kumari, M . A.

 

సదవగాహన -1

                                                                     Chilakamarthi.  Lakshmi kumari, M . A.

 

               జీవు ల౦దరిలో మనిషికో ప్రత్యేకత ఉంది. ఎ౦దుకంటే మనిషి బుద్ధి జీవి. ఏ విషయానైనా బుద్ధితో ఆలోచిస్తాడు. ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఆ విషయం పట్ల సదవగాహన కావాలి. అందువల్ల జీవితం పట్ల జీవితంలో జరిగే విషయాల పట్ల సదవగాహన కలిగి ఉండడం ఎంతైనా అవసరం . ఉదాహరణకి మనిషి జీవితంలో ఆరోగ్యం చాల ముఖ్యం . శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అన్నాడు కాళిదాస మహాకవి. మనం ఏ ధర్మ కార్యాలుచెయ్యాలన్నా ఏ మంచిపనులు చెయ్యాలన్నా ముందు ఆరోగ్యవంతమైన శరీరం కావాలి. ఆరోగ్యం అంటే కొంత మంది రోగం లేకపోవడం అనుకుంటారు. అది కాదు రోగం లేనంత మాత్రాన ఆరోగ్యం గా ఉన్నట్లుకాదు.

కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని కాపాడు కోవడం మనిషి కర్తవ్యమ్.

ఈ ఆరోగ్యానికి మంచి గాలి, నీరు, ఆహారంతో  పాటుగా మంచి ఆలోచనలు కూడా ఉండాలి . మనస్సు ఎప్పుడు మంచి ఆలోచనలతో నిండి ఉంటే  సగం ఆరోగ్యం చేకురినట్లే. .మనిషిబుద్ధి  చాల చంచలంగా ఉంటుంది . ఎదో విషయం ఆలోచిస్తూ ఉంటుంది . మనస్సును వశం చేసుకోవడం చాల కష్టం . మంచి ఆలోచనలవైపు మనస్సు మలచడం  వల్ల శరీర ఆరోగ్యం  కుదుట పడుతుంది.  అందువలన మనిషి ఎప్పుడు , ఎక్కడ , ఎ లా వ్యవహరించాలో, అప్పుడు , అక్కడ  అలా వ్యవహరించాలి. మంచి పుస్తకాలు చదవడం,  మంచి మంచి సంగీత,  సాహిత్య కార్య క్రమాలు చూడడం వల్ల మనస్సు కుదుట పడుతుంది.  అందువల్ల మనిషికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు అవసరమో అది, అప్పుడు, అంతవరకే చెయ్యాలి. శక్తికి మించిన పనులు చెయ్యకూడదు. ఇది మన శరీరం పట్ల ఉండవలసిన సదవగాహన.

మరో ముఖ్యమైన విషయం : జీవితంలో ఎప్పుడు, లాభనష్టాలు  బేరీజు వేసుకో కూడదు . వ్యాపారంలో లాభనష్టాలు లుంటాయి .  జీవితం వేరు వ్యాపారం వేరు. మనిషి పుట్టి నప్పుడు zero balance తో వస్తాడు పోయినప్పుడు వట్టి చేతులతో పోతాడు. ఏదీ తీసుకు రాడు. ఏదీ  తీసుకు పోడు.  జీవించడమే జీవితం లక్ష్యం . జీవితం చాల కాలం కొనసాగాలని మనిషి కోరుకోకూడదు. జీవించినంత కాలం ఆరోగ్యవంతంగా , ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సుఖంగా జీవించాలనుకోవాడ మే జీవిత లక్ష్యం .  

  

No comments: