శాస్త్రార్థం - విపరీతార్థం
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
मेघच्छन्नेsह्निदुर्दिनमित्यदुक्तमसङ्गतम्
यद्दिने तद्दिनं नास्ति तद्दिनं मम दुर्दिनम्
The day on which the sky is totally covered or eclipsed by clouds throughout the day is called durdinam मेघच्छन्नेsह्निदुर्दिनम् , is not at all correct. But the day in which there is no pitru shraaddha is indeed a durdinam for me. These are the words of a purohit who chiefly depends up on inauspicious vedic rituals
మేఘచ్ఛన్నేs హ్ని దుర్దిన మిత్యదుక్తమసంగతమ్
యద్దినే తద్దినం నాస్తి తద్దినం మమ దుర్దినమ్
మేఘచ్ఛన్నే = మేఘాలచే ఆవరి౦పబడిన ; అహ్ని = రోజు; దుర్దిన౦ = దుర్దినమని; యదుక్తం= ఏమాట చెప్పబడిందో ; (తత్) అసంగతం = అది సరియైనది కాదు ; యద్దినే = ఏ రోజు ; తద్దినం = తద్దిన౦ (పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మ ) ; నాస్తి = ఉండదో; తద్దినం= ఆ రోజు; మమ = నాకు; దుర్దినమ్ = దుర్దినం (చెడ్డరోజు).
రోజంతా ఆకాశం మేఘంతో ఆవరించి ఉంటే ఆరోజు దుర్దినమని పండితులు చెపుతున్నారు. అది సరైనది కాదు. ఏ రోజు తద్దినం ఉండదో ఆ రోజు నాకు దుర్దినం అని ఒక పురోహితుడు అంటున్నాడు .
No comments:
Post a Comment