Let us not be too logical.
అనవసరంగా అన్ని తర్కి౦చకూడదు
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
మన ఇళ్ళల్లోను,
చుట్టూ ఉన్న సమాజంలోను కొంతమంది వ్యక్తుల్ని పరిశీలిస్తే ఎప్పుడు ఏదో వితండవాదన
చేసేవాళ్ళు కొంతమంది కనిపిస్తారు. ప్రతివిషయానికి
కారణం , ఆ కారణాల్లో లొసుగులు, బలహీనతలు
వెదుకుతూ ఉంటారు. మనం ఇతరులు చెప్పింది
గ్రుడ్డిగానమ్మడం ఎంత తప్పో, అన్నిటికీ అవసరంలేని కారణాలు వెదకడం కూడ అంతే తప్పు
పైగా ఎంతో సమయం వృధా అవుతుంది . గ్రుడ్డిగా నమ్మకుండా హేతుబద్ధంగా ఆలోచిoచి నిర్ణయాలు తీసుకోవడం కోసం తర్కశాస్త్రం ఏర్పడింది . తర్కశాస్త్రం అన్నిటిని హేతుబద్ధంగా తర్కించి
నిర్ణయిస్తుంది. అన్నిటికీ ఒక కారణ౦
వెదకడం తర్కంలో ఒక ప్రక్రియ. భగవంతుడు అనే ఒకడు ఉన్నాడని తర్క శాస్త్రం వల్లనే మనకు
తెలిసింది . ఒక వస్తువు మనకు కనిపిస్తోంది for example chair అనుకుందాం . అంటే ఆ వస్తువును తయారు చేసేవాడు
ఒకడున్నాడు. ఈ విశాలమైన విశ్వం ఉ౦దంటే దీన్ని సృష్టించిన వాడు ఒకడు GOD (generator operator destroyer) ఉన్నాడని మనకు తెలిపింది తర్క శాస్త్రమే.
కాని ఐనదానికి, కానిదానికి తర్కించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అన్ని
విషయాల్లోనూ తర్కిస్తే వచ్చే ప్రమాదాన్ని వివరించే ఒక చిన్న సంఘటన రూపమైన కథ మన౦ తెలుసు
కుందాం .
పూర్వం ఒక
గురుకులంలో కొంతమంది విద్యార్థులు తర్కం చదువుతూ ఉండే వారు. ఒక రోజున గురువు గారు
ఒక శిష్యుణ్ణి పిలిచి నువ్వులిచ్చి గానుగులో
నూనె ఆడించి తీసుకురమ్మన్నారు . వాడికప్పుడే
చదువు పుర్తయిoది , తర్కశాస్త్రం గట్టిగా చదివేడు, మంచి విద్యాగర్వంతో
ఉన్నాడు. గురువుగారిచ్చిన నువ్వులు తీసికెళ్ళి తెలుకుల వానికిచ్చాడు. నూనె ఆడమని అడిగాడు. అటువంటి గొప్ప పండితుడు తన
వద్దకు వచ్చినందుకు ఆ తెలుకులవాడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు. ఏం
చదువుకున్నారు బాబయ్యా! అని అడిగి, వివరంగా తెలుసుకుని, ఆదరంగా కూర్చోబెట్టి, అతడిచ్చిన నువ్వుల్ని
గానుగులో పోసి ఆడుతున్నాడు . ముందే అనుకున్నాం గదా! తర్కపండితుడు ఎప్పుడు
కార్యకారణభావం వెదుకుతాడని. ప్రశాంతంగా కూర్చోలేక
ఇలా ఆలోచిస్తున్నాడు. నూనె రావాలంటే
గానుగ తిరగాలి , గానుగ తిరగాలంటే ఎద్దు తిరగాలి . కాని ఆ ఎద్దు మెడలో గంటలున్నాయి
. ఆ గంటలకు నూనెకు కార్య కారణ సంబంధం లేదు
. ఎద్దు మెడలో గంటల్లేక పోయినా నూనె తయారవడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు కదా ! . అదే
అడిగాడు ఏమయ్యా ! ఆ ఎద్దుకి మెడలో గంటలెందుకున్నాయ్ ? గంటలు లేక పోయినా నూనె
రావడానికి ఎటువంటి ఆటంకం లేదు కదా అని. దానికి ఆ గానుగు యజమాని వినయంగా అయ్యా ! ఇది చాల దొంగ ఎద్దండి .
మధ్యలో ఆగిపోతూ ఉంటుంది . అది ఆగినప్పుడు గంటల చప్పుడు ఆగిపోతుoది కదా! అప్పుడు మరల నేను దీన్ని తోలుతూ ఉంటాను అన్నాడు.
ఓహో అదా! ఒకవేళ ఆ ఎద్దు కదలకుండానే ఉండి అటు ఇటు తలాడిస్తే నీ కెలా తెలుస్తుంది ? అనడిగాడు . దానికి సమాధానంగా గానుగు యజమాని అదా బాబయ్యా ! మీ సందేహం . అటువంటి పరిస్థితి నాకు ఎప్పుడు రాదు . ఎoదు కంటే మా ఎద్దు మీలా తర్కం చదువు కోలేదు కదా! అన్నాడు .
ఒకసారి ఇద్దరు పండితులు దెబ్బలాడుకుంటున్నారు . ఒకాయన కోడి కి గ్రుడ్డు ఆధారం ( కారణం ) అంటాడు. మరొక వ్యక్తి గ్రుద్దుకు కోడి ఆధారం అంటున్నాడు. వాదం తారాస్థా యికి చేరుకుంది . జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. అ సమయంలో ఒక పల్లెటూరి బైతు ఆ దారిలో నడిచి వెడుతున్నాడు . వీళ్ళ చూసి బాబు ! ఎందుకు కొట్టు కుంటున్నారు ?? అని అడిగాడు . వాళ్ళు చెప్పేరు . అది విన్న ఆ పల్లెటూరి బైటు వారితో ఇలా అన్నాడు.
కుక్కుట్యా: కారణం వాoడo
కుక్కుటీవాoడకారణం
ఇతి తే సంశయో మాభూ
దుభయం తృప్తి కారణం.
కోడికి గ్రుడ్డు కారణమా లేక గ్రుడ్డు కి కోడి కారణమా అన్ని తన్నుకు చావకండి. ఈ రెండిటికి ఆ రెండు (పుంజు + పెట్త ) కలుసు కొడం కారణం అన్నాడు
తర్క పండితులకు క్షమాపణలతో ........
No comments:
Post a Comment